ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 9:04 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

అమెరికాలో తెలంగాణకు పెట్టుబడుల పిలుపు: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

బాల్టిమోర్ (అమెరికా):అర్జున్ సమాచారం:
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ జాతీయ మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రవాస భారతీయులకు మాతృభూమికి రుణం తీర్చుకునే సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.
ముఖ్యాంశాలు:
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాలకు పోటీగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
సింగిల్ విండో విధానం ద్వారా అన్ని అనుమతులను వేగంగా మంజూరు చేసి, ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
పరిశ్రమలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రవాస భారతీయులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
మూసీ నది పునరుజ్జీవనం, రీజినల్ రింగ్ రోడ్ (RRR), 36 రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ నిర్మాణం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వివరించారు.
ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రవాసులు భాగస్వాములు కావాలని కోరారు.
ఎన్‌ఆర్‌ఐల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ
ఎన్‌ఆర్‌ఐలు, వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధ అధికారాలతో కూడిన ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటును ప్రభుత్వం పరిశీలిస్తోందని వెల్లడించారు.
తెలంగాణలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని వినియోగించుకుని, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆన్‌లైన్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని ప్రవాసులకు విజ్ఞప్తి చేశారు.
===========================